న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి మరింతగా పనిచేస్తామని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్ తెలిపారు. బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటిలో న్యాయవాదులతో సమావేశమైన ఆయన, 1982లో జస్టిస్ కృష్ణయ్యర్ స్థాపించిన ఐఏఎల్ న్యాయవాదుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నదని తెలిపారు.తనను మరోసారి బార్ కౌన్సిల్ సభ్యుడిగా గెలిపిస్తే న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.