నాగారం: సర్వదేవతల సమ్మేళనం బొడ్రాయి పండుగ: ఈటూరులో మాజీ ఎమ్మెల్యే కిషోర్
గ్రామంలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, దుష్టశక్తులు, ప్రకృతి ప్రకోపాల నుంచి కాపాడే సర్వదేవతల సమ్మేళనం బొడ్రాయి పండుగ అని మాజీ ఎమ్మెల్యే కిశోర్ అన్నారు. మంగళవారం నాగారం మండలం ఈటూరులో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. గ్రామదేవతల పండుగలతో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నారు.