భీమవరం: జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆక్వా జోన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్ష
జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ లోని ఛాంబర్ నందు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కు మత్స్య శాఖ అధికారులు వివరిస్తూ ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు.