ఒంగోలు అర్బన్: పోలీస్ కార్యాలయంలో ఘనంగా బళ్లారి రాఘవ జయంతి వేడుకలు
Ongole Urban, Prakasam | Aug 2, 2026
తెలుగు నాటక రంగ పితామహుడు, సహజ నటనకు ఆద్యుడు, నాటక సంస్కర్త తాడిపత్రి రాఘవాచార్యులు (బళ్ళారి రాఘవ) జయంతి సందర్భంగా ఆదివారం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు పోలీసు అధికారులు మరియు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో బళ్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, తెలుగు నాటక రంగంపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని తెలిపారు. తెలుగు నాటక రంగ అభివృద్ధికి విశేష సేవలందించిన గొప్ప రంగస్థల నటుడు బళ్లారి రాఘవ సహజ నటనకు ప్రాధాన్యతనిస్తూ, నాటకాన్ని కేవలం వినోద సాధనం కాదన్నారు