పిచ్చాటూరు మండలం సిద్దిరాజుకండ్రిగ గ్రామంలో సోమనాధేశ్వర స్వామికి వైభవంగా అన్నాభిషేకం
పిచ్చాటూరు మండలంలోని సిద్ధిరాజుకండ్రిగ గ్రామంలో వెలసి ఉన్న సోమనాథేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు నవీన్ స్వామి సోమనాథుడికి అన్నాభిషేకం చేశారు. అనంతరం కర్పూర నీరాజనాలు అందజేసి తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ ధర్మకర్త వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.