మే 9న కోవెలకుంట్లలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణ పరిధిలోని శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్వర్యంలో మే 9వ తేదీన సీనియర్ విభాగం ఏడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. గెలుపొందిన వృషభ రాజులకు బహుమతులు వరుసగా రూ.1.10 లక్షలు, రూ.90 వేలు, రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేల, రూ.20వేల అందజేయనున్నట్లు పేర్కొన్నారు.