ఒంగోలు అర్బన్: ఒంగోలులో బంగారు తాకట్టు విషయంలో మోసం, జాయింట్ కలెక్టర్కు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
Ongole Urban, Prakasam | Apr 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ బ్యాంకులో బంగారు తాకట్టు విషయంలో భారీ అక్రమం వెలుగుచూసింది. తన బంగారం వేరొకరి పేరు మీదకు మారిందని.. అందులో కొంత భాగాన్ని బ్యాంకు సిబ్బంది కాజేశారని ఓ మహిళా జాయింట్ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన జాయింట్ కలెక్టర్, ఎస్పీ దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వన్ టౌన్ పోలీసులను ఆదేశించారు