రాజమండ్రి సిటీ: కష్టపడే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుంది : రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమండ్రి జాంపేట లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ పాలకమండలి అభినందన సభ ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నూతన పాలక మండలి అభినందించారు. కూటమి పార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. కష్టపడే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.