టీచర్ల డిమాండ్ల సాధనకై యూటీఎఫ్ ఆధ్వర్యంలో 'రణభేరి', గోడపత్రికను ఆవిష్కరించిన నేతలు
Ongole Urban, Prakasam | Sep 15, 2025
తమ డిమాండ్ల సాధనకు చేపట్టనున్న రణభేరి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను యుటిఎఫ్ నాయకులు సోమవారం సాయంత్రం కొత్తపట్నం మండలం గవండ్లపాలెం జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదని,పెండింగ్ బకాయిలను ఇవ్వలేదని విమర్శించారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ రణభేరి నిర్వహిస్తున్నామని, స్పందన కొరవడితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు