నంద్యాల అర్బన్: డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ నంద్యాల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
Nandyal Urban, Nandyal | Jun 1, 2026
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఔకత్వకలపై విచారణ చేపట్టాలని నంద్యాల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజిఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ రాజకుమార్ కి వినతి పత్రం అందించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మెరిట్ లిస్టు విడుదల చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఎమ్మెల్సీ ఇషాక్ ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు