డోన్: బేతంచెర్ల లో రైల్వే గేట్ మూత,,ఇబ్బందుల్లో వాహనదారులు
Dhone, Nandyal | Apr 11, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం రహదారిలో రైళ్ల రాకపోకలతో అరగంటకోసారి రైల్వే గేట్ మూత పడుతుండటంతో వాహనదారులు ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగాపురం రైల్వే గేట్ వద్ద ఎండాకాలంలోనైనా రైల్వే అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు.