ఒంగోలు అర్బన్: టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ను పదవి నుంచి తొలగించాలని కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపిన వైసీపీ నేతలు
Ongole Urban, Prakasam | Apr 4, 2026
వైఎస్ ఆర్ సి పి పార్టీ పిలుపు మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ని తన పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు పట్టణంలో చెన్నకేశవ స్వామి ఆలయం ఎదుట శనివారం నిరసన వ్యక్తం చేశారు .ఒంగోలు అసెంబ్లీ నియోజక వర్గ సమన్వయ కర్త శ్రీ చుండూరి రవి బాబు ,ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఒంగోలు లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చుండూరి రవి బాబు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం లో టీటీడీ లో జరుగుతున్న అక్రమాలపై ధ్వజమెత్తారు,