బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో మహిళలు మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామంలో ఒంటరి మహిళను నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ బాబు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. బాధిత మహిళను దద్దిగాళ్ల కిరణ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేసి మోసగించాడు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి మహిళలు మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు