రాప్తాడు: కష్టపడే ప్రతి కార్యకర్తకు టిడిపి పార్టీ అండగా ఉంటుంది అనంతపురంలో ఆత్మకూరు టిడిపి నేతలతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంప్ కార్యాలయం నందు మంగళవారం ఒకటిన్నర గంటల సమయంలో ఆత్మకూరు మండలానికి చెందిన భూమా వెంకటనారాయణ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ అభివృద్ధి బోర్డు నెంబర్ గా నియమించినందుకు ఆత్మకూరు టిడిపి నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీతకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ టిడిపి పార్టీ కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తుందని అందులో భాగంగా ఆత్మకూరు భూమా వెంకటనారాయణకి పరిశ్రమ అభివృద్ధి బోర్డు సభ్యునిగా నియమించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.