విద్యతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని మానవత సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సుండుపల్లి రోడ్లోని ఏపీ మోడల్ స్కూల్లో మానవత సంస్థ ఆధ్వర్యంలో నైతిక విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ప్రిన్సిపాల్ రేఖ, ప్రసన్నకుమార్, మానవత సంస్థ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ— విద్యార్థులకు విజ్ఞానంతో పాటు నైతిక ధర్మాలు, సామాజిక బాధ్యతలు బోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం పిల్లల ప్రగతికి కీలకమని పేర్కొన్నారు