ఒంగోలు అర్బన్: ముందస్తు జాగ్రత్తలో భాగంగా పలు ప్రాంతాలను తనిఖీ చేసిన ఒంగోలు పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 25, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు వన్ టౌన్ సిఐ వెంకటేశ్వరరావు, ఒంగోలు టూ టౌన్ సిఐ ఎం. శ్రీనివాసరావు మరియు సిబ్బంది కలిసి ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో డాగ్ స్క్వాడ్, పేలుడు పదార్థాలు కనుక్కునే జగిలాం చీత మరియు బాంబు స్క్వాడ్‌తో పాటు పోలీస్ లు పాల్గొన్నారు.ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు పార్శిల్ సెంటర్లలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.