ఉరవకొండ: కౌకుంట్ల గ్రామంలో డ్రైడే- ఫ్రైడే కార్యక్రమం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు డ్రైడే- ఫ్రైడే కార్యక్రమాలను ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పి హెచ్ సీ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరగడంతో జెసీబీ సాయంతో తొలగింప చేశారు. గ్రామంలోని కాలనీలో ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది వెళ్లి ఇళ్లలో నీరు నిలువ ఉండకుండా డ్రైడే- ఫ్రైడే పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.