నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను ఎక్సైజ్ ఎస్టీఏఫ్ టీం పట్టుకుంది. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ దాడుల్లో మొత్తం 532 ప్యాకెట్లలో 2.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాళ్లతో పాటు మరో 10 మందిపై కూడా కేసులు నమోదు చేసి, నిందితులను ఎక్సైజ్ శాఖకు అప్పగించారు.