A. B. C.క్యాంపు క్వార్టర్స్‌లో ఎన్నో ఏళ్లుగా ఆలోట్మెంట్లు కలిగి హెచ్ఆర్ఏ చెల్లిస్తున్న ఉద్యోగులను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా 15 రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయాలని ఆర్అండ్బి, రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేయడాన్ని క్వార్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. కొత్త ఇళ్ల అద్దెలు రెండింతలు పెరగడంతో ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, మహిళలు–పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. హైకోర్టు బెంచ్ పేరుతో బెదిరింపులు చేయడం సమంజసం కాదని పేర్కొంది.ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, కర్న