ఆళ్లగడ్డ: ఎర్రగుంట్ల గ్రామంలో ఉపాధి పనికి వెళ్లిన మహిళ రమణమ్మ మృతి
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల కు చెందిన రమణమ్మ బుధవారం ఉపాధి పనులకు వెళ్లి మృతి చెందింది, ఉపాధి పనుల వద్ద ఛాతినొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ఆమెను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు, మృతురాలికి భర్త ఇద్దరు కుమారులు ఉన్నారు భర్త తిమ్మయ్య హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు