కడప: నవంబర్ 2న బ్రౌన్ జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Kadapa, YSR | Oct 30, 2025 నవంబర్ 2 తేదీ జరిగే బ్రౌన్ శాస్త్రి శతజయంతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సి పి బ్రౌన్ గ్రంథాలయానికి రానున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను. ఆదేశించారు.గురువారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బ్రౌన్ శాస్త్రి శతజయంతోత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో అధికారిక ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.