మాచెర్ల: కారంపూడి పట్టణంలో రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం సన్నిగండ్ల ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం 6 సమయంలో ఆటో బోల్తా పడింది. అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న సిఐ శ్రీనివాసరావు వెంటనే స్పందించి బాధితున్ని పిడుగురాళ్ల హాస్పెటల్కు తరలించారు. గుత్తికొండ బిలం దర్శించుకుని తిరిగి వస్తున్న కండ్లగుంట గ్రామస్తుల ఆటో అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.