ఇండో సోల్ పరిశ్రమను కరేడులో కాకుండా దొనకొండలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
Ongole Urban, Prakasam | Sep 16, 2025
కరేడు రైతులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ కన్వీనర్ రాయపాటి జగదీష్ మద్దతు ప్రకటించారు.అక్కడ ఏర్పాటు చేయ తలపెట్టిన ఇండో సోలో పరిశ్రమను దొనకొండలో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినట్లు ఆయన మంగళవారం సాయంత్రం ఒంగోలులో మీడియాకు చెప్పారు. దొనకొండలో 36 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నందున అక్కడ ఈ పరిశ్రమలు పెడితే ఎవరికి ఇబ్బంది ఉండదని, పైగా పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కరేడులో ఇండో సోల్ వద్దు దొనకొండ ముద్దు అన్న నినాదంతో ఉద్యమిస్తున్నట్లు చెప్పారు