ధన్వాడ: గ్రామపంచాయతీ కార్మికుల రెండు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి:సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బల్ రామ్
గ్రామపంచాయతీ కార్మికుల రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామములో గ్రామపంచాయతీ కార్యదర్శి చాణిక్య రెడ్డికి గురువారం రోజు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బల్ రామ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను రెగ్యులర్గా ఇవ్వకపోవడం వల్ల పంచాయితీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కనీస అవసరాలు తీరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని తెలిపారు