ఒంగోలు అర్బన్: ఉమ్మడి జిల్లాలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించిన అధికారులు
Ongole Urban, Prakasam | Jun 26, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ఈనెల 27వ తేదీన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఏర్పాట్లలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎం కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించారు. ఇంధనం పొదుపులో భాగంగా వాహన సంఖ్య భారీగా తగ్గించినట్లు తెలుస్తుంది. హెలిపాడ్ వద్ద నుంచి సీఎం చంద్రబాబు కాన్వాయిలు సభస్థలికి చేరుకుంటారు. ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. 900 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.