బనగానపల్లె: సంజామల మండలంలో జన గణ ప్రక్రియను పరిశీలించిన తాసిల్దార్
నంద్యాల జిల్లా సంజామల తహశీల్దార్ చంద్రశేఖర్ గురువారం మిక్కినేనిపల్లెలో పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న జనగణన సెన్సస్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సెన్సస్ పురోగతి, వివరాల నమోదు విధానంపై ఎన్యూమరేటర్, పశుసంవర్ధక కార్యదర్శి మహబూబ్ బేగ్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, సెన్సస్ ప్రక్రియను వేగవంతంగా పూరి చేయాలని తహశీల్దార్ చంద్రశేఖర్ ఆదేశించారు