నందికోట్కూరు: జూపాడుబంగ్లా జర్నలిస్టులపై దాడుల కు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్ బాబు డిమాండ్ చేశారు, ఆదివారం జూపాడు బంగ్లా సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య ఘటన, నందికొట్కూరు పట్టణంలో కత్తితో దాడి ఘటన పై ఆందోళన వ్యక్తం చేశారు, రాష్ట్రంలో జర్నలిస్టుపై దాడులు హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.