ఉండ్రాజవరం మండలంలోని పలు గ్రామాల్లో పోలీస్ కవాతు
సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మండలంలో ఎన్నికల కోడ్ అమలు జరుగుతోంది. సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సు బలగాలతో మండలంలోని చివటం, పాలంగి, కే సావరం, ఉండ్రాజవరం గ్రామాలలో ఆదివారం పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వి అప్పలరాజు మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, తమ ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చునని, ఎన్నికల వేళ ఎటువంటి అసాంఘిక చర్యలు, అవాంఛిత సంఘటనలు జరుగుకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉందన్నారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవా