గుంతకల్లు: సరియైన రికార్డులు లేకపోతే కేసులు నమోదు చేస్తాం: గుత్తిలో వాహనదారులను హెచ్చరించిన ఎస్ఐ సురేష్
వాహనదారులందరూ తప్పనిసరిగా రికార్డులను కలిగి ఉండాలి. సరియైన రికార్డులు లేకపోయినా, రోడ్డు నిబంధనలు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని గుత్తి ఎస్సై సురేష్ హెచ్చరించారు. గుత్తిలోని ఎన్టీఆర్ సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం రాత్రి ఆయన పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. సరైన రికార్డులు, హెల్మెట్, లైసెన్స్, ఆర్సీ లేని వాహనదారులపై జరిమానా విధించారు. అందరూ రికార్డులు కలిగి ఉండాలని, రోడ్డు నిబంధనలో పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగమాణిక్యం, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.