గుంతకల్లు: గుత్తిలో ఓ ఇంటికి పెయింటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి పెయింటర్ మహేష్ కు తీవ్ర గాయాలు
గుత్తిలోని తురకపల్లి రోడ్డు లో నారాయణ అనే వ్యక్తికి చెందిన ఇంటికి పెయింటింగ్ చేస్తున్న పెయింటర్ మహేష్ కు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికలు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం అనంతపురం రెఫర్ చేశారు. గార్లదిన్నె మండలం కల్లుమడికి చెందిన మహేష్ గుత్తికి వచ్చి పెయింట్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.