అనంతపురం అర్బన్: పిజిఆర్ఎస్ అర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | May 4, 2026
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించగా, ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్405 అర్జీలను స్వీకరించారు.జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాశ్ కుమార్,డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రమేష్ రెడ్డి, రామ్మోహన్, నాగరాజునాయుడు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరలు పాల్గొన్నరు.