అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా గోవిందయ్య దొడ్డి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఓ వ్యక్తికి గాయాలు
Anantapur Urban, Anantapur | May 8, 2026
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బ్రహ్మసముద్రం మండలం గోవిందయ్య దొడ్డి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన తిప్పేస్వామి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.