కడప: రైతులకు ఎటువంటి షరతులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని కడప కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకులు ఆందోళన
Kadapa, YSR | Sep 15, 2025 కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం రైతులకు ఎటువంటి షరతులు లేకుండా యూరియా పంపిణి చేయాలని పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ ఆందోళనకు దిగారు. రైతులకు యూరియా కావాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం యారియా పంపిణీ ఆలస్యం చేస్తోందని ధ్రువకుమార్ తీవ్రంగా విమర్శించారు. రైతుల కష్టాలను వెంటనే పరిష్కరించాలని కోరారు.