గుంతకల్లు: పట్టణంలో పైకప్పు కూలి ఏకలవ్య నగర్ కు చెందిన వెంకటరమణ అక్కడిక్కడే మృతి
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో శనివారం పాత భవన పైకప్పు కూలి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఏకలవ్య నగర్ కు చెందిన వెంకట రమణ బైక్ లో కూరగాయల మార్కెట్ కు వెళ్తున్నాడు. అయితే పాడు బడిన భవనం పైకప్పు ఒక్కోసారిగా కూలి అతడిపై పడి అక్కడక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు