ఒంగోలు అర్బన్: ఒంగోలులో స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపును పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందని వెల్లడి
Ongole Urban, Prakasam | May 7, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపును గురువారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ క్యాంపులో విద్యార్థులు పలు క్రీడాలలో పాల్గొని వారి సత్తాని పరీక్షించుకున్నారు. భవిష్యత్తులో ప్రకాశం జిల్లా నుంచి మంచి క్రీడాకారులు తయారవుతారని అన్నారు. ఆడుదాం ఆంధ్ర అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని వారిని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదని అరెస్టు చేస్తుందని కూటమినేతలు అన్నారు.