నందికోట్కూరు: నందికొట్కూరు లోని హాస్టల్లో అంగన్వాడి కేంద్రాలు గురుకుల పాఠశాలలు ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్
నంద్యాల జిల్లా నందికొట్కూరు పేద విద్యార్థులకు వడ్డించే భోజనంలోనూ మేయాలని దోచుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. నందికొట్కూరులో పలు హాస్టళ్లు,పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో దడ పుట్టించారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్..శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఎస్సీ,బిసి బాల బాలికల 4 హాస్టళ్లను తనిఖీ చేయడం ప్రారంభించారు.తర్వాత లక్ష్మాపురం అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల,పగిడ్యాలలో కేజీబీవీ,మోడల్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, నందికొట్కూరు పట్టణంలో మార్కెట్ యార్డ్ లో సివిల