నాగిరెడ్డిపాలెం గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు, పూర్తిగా దగ్ధమైన ఆఫీస్
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండుగులు సోమవారం ఉదయం నిప్పంటించారు. తెల్లవారుజామున 2 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు, పార్టీ శ్రేణులు తెలిపారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇచ్చిన సమచారం మేరకు హుటాహుటిన నీళ్ళు చల్లి మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ.... అప్పటికే పార్టీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు.