డోన్: బేతంచర్లలో ఓ మోస్తారు వర్షం
Dhone, Nandyal | Jun 2, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో మంగళవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చి ఈ వర్షం ప్రారంభమైంది. తీవ్ర ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు ఈ వానతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ అకాల వర్షం మామిడి, బొప్పాయి, అరటి తోటల రైతులకు కొంత నష్టం కలిగించగా, త్వరలో విత్తనాలు వేయబోయే వ్యవసాయ రైతుల్లో మాత్రం సంతోషాన్ని నింపింది.