సిరిసిల్ల: గొర్రె పిల్ల దొంగతనం కేసు నమోదు
గొర్రె పిల్ల దొంగతనం కేసు నమోదు.ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో గొర్రె పిల్ల దొంగతనం జరిగిందని గొర్రె బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాహుల్ రెడ్డి కేసు నమోదు చేశారు.మంగళవారం ఉదయం 10 గంటలకు గొర్లమందకు వెళ్లి చూడగా అందులో 6000 రూపాయల గల ఒక గొర్రె పిల్ల కనిపించలేదని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గొర్రె పిల్లని దొంగలించారని బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు.