మర్రిగూడ: మర్రిగూడలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు పాఠాలు బోధించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం మధ్యాహ్నం ఆకాశమికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది, నిర్మాణంలో ఉన్న గదులను ఆమె పరిశీలించారు. అనంతరం క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించి, కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుతోనే ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులు చదువులో రాణించాలని కోరారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.