నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా మొహరం వేడుకలు
Nandyal Urban, Nandyal | Jun 25, 2026
నంద్యాలలో మొహర్రం వేడుకలు బుధవారం రాత్రి అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. పలు కాలనీలలో మొహర్రం సందర్భంగా సందడి నెలకొంది. భక్తులు భక్తి శ్రద్ధలతో పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుర వీధుల్లో మేళతాళాలు, తప్పెట్లతో పీర్లను ఉరేగించారు. హిందూ, ముస్లింలు ఉత్సహంగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.