గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధుల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవాదాయ శాఖ ప్రకటించింది.అధికారుల వివరాల ప్రకారం, నిర్మాణ స్థల పరిమాణం ఆధారంగా ఆలయాలను టైప్–A, B, Cగా విభజించి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నారు.దరఖాస్తుతో పాటు స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు, భూస్వామి నుండి NOC తప్పనిసరిగా జత చేయాలని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ సంబంధిత దేవాదాయ శాఖ కార్యాలయాలకు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.