గాంధారి: శివ భక్త మార్కండేయ ఆలయంలో చోరీ, గాంధారిలో ఒక బైకు దొంగతనం : ఎస్సై ఆంజనేయులు
గాంధారి మండల కేంద్రంలో గల శివ భక్త మార్కండేయ ఆలయ ఆవరణంలో వరండా వద్ద గత 20 రోజుల క్రితం పెట్టిన హుండీ ని గుర్తు తెలియని వ్యక్తి పగలగొట్టి దాంట్లో గల దాదాపు 3 వేల రూపాయల నగదు ను దొంగిలించుకుని పోయినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆలయ కమిటీ మెంబర్ గుంటుక అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అలాగే గాంధారి గ్రామంలో కల ఒక బైకు దొంగతనానికి గురైందని తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిని వెంటనే పట్టుకుంటామని, సీసీ కెమెరాల పరిరక్షణలో ఎవరు తప్పించుకోలేరని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.