ఆళ్లగడ్డ: బత్తలూరు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం, 20 గడ్డివాములు దగ్ధం, కోటిన్నర ఆస్తి నష్టం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని బత్తలూరు గ్రామంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది, రాత్రి 11 గంటల సమయంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి సుమారు 20 గడ్డివాములు దగ్ధమయ్యాయి, వందలాది పశువులకు నిలువ చేసిన మేతఫూర్తిగా కాలిపోవడంతో పాడి రేతులు తీవ్రంగా నష్టపోయారు, కోటిన్నర మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.