నూజివీడును NTR జిల్లాలో కలపాలని నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శివాజీ డిమాండ్
Nuzvid, Eluru | Sep 24, 2025 నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలని నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మేఘాలయ లోని నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దోనేటి శివాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం 9:30 సమయంలోమాట్లాడుతూ ఎందరో నాయకులు ఇచ్చిన హామీ, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలు, ప్రజల ఆకాంక్షల మేరకు నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయడం సబబైన అంశంగా పేర్కొన్నారు. నూజివీడు సంస్థానం చరిత్ర ఎంతో ఘనమైనదని... గొప్ప చరిత్ర కలిగిన నూజివీడు ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా రూపొందించడం మరింత వన్నెతెస్తుందని సూచించారు. అంద