ఒంగోలు అర్బన్: నాగార్జునసాగర్ నుంచి వస్తున్న నీటిని సమర్థంగా వినియోగించుకునేలా నిరంతర పర్యవేక్షణ అవసరం : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 1, 2026
నాగార్జునసాగర్ నుంచి వస్తున్న నీటిని సమర్థంగా వినియోగించుకునేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. సోమవారం ఆయన జె.పంగులూరు మండలంలోని రామకూరు గ్రామంలో నాగార్జునసాగర్ నుంచి వస్తున్న కాలువను పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న నీటి పరిమాణము, ప్రవాహ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్రాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలోని అన్ని చెరువులను పూర్తిస్థాయి నింపాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని, పొరుగు జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.