కేతేపల్లి: కొర్లపాడు టోల్గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్, 65వ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
నల్గొండ జిల్లా, కేతేపల్లి మండలం, కొర్లపాడు టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆదివారం రాత్రి జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులు ముగియడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65 వాహనాల రద్దీ పెరిగింది. టోల్గేట్ వద్ద క్యూ లైన్ లు పెంచకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.