గుంతకల్లు: పామిడి మండలం కాళాపురం వద్ద అనుమానాస్పదంగా యువకుడు మృతి, రోడ్డు ప్రమాదంగా నిర్ధారణ
పామిడి మండలం కాళాపురం గ్రామ శివారులో గత రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన జి.కొట్టాల గ్రామానికి చెందిన దేవన సతీష్ కుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. మద్యం మత్తులో ఉన్న సతీష్ రెడ్డి వెనుక నుంచి ట్రాక్టర్ ను ఢీ కొనడంతో మృతి చెందినట్టు తెలిసింది. పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ దేవరపల్లి సాయికుమార్ ను విచారించగా అతడు చెబుతున్న విషయాలను బట్టి రోడ్డు ప్రమాదంగా నిర్ధారణ చేశారు.