పల్నాడు ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జాయింట్ కలెక్టర్ సూరజ్
నరసరావుపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ మురళీ, ఆర్డీవో మధులతతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.