నందికోట్కూరు: మిడుతూరు మోడల్ స్కూల్లో జనగణనపై అధికారులకు శిక్షణ,మే ఒకటి నుండి ఇండ్ల కు వెళ్లివివరాల సేకరణ
నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో 2027 కు సంబంధించిన జనగణనపై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు.మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ లో శుక్రవారం ఫీల్డ్ ట్రైనర్లు ఎం జైలానీ, వేణుగోపాల్ జనగణనపై కుటుంబ సభ్యుల వివరాలు ఏవిధంగా సేకరించాలనే వాటి గురించి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా శిక్షణ ఇచ్చారు.మే ఒకటి నుండి మే 31 వరకు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలనుసేకరించాలన్నారు.ఈ శిక్షణలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి క్షేత్రస్థాయిలో పరిశీలన యాప్ లో ఇచ్చిన ఇస్తున్నట్లు ట్రైనర్లు తెలిపారు.మీరు ఇండ్ల వద్దకు వెళ్ళినప్పుడు కుటుంబ స్థితిగతులు మరియు కుటుంబ సభ్యుల పూర్తి వివరాల